నిఖిల్ (హ్యాపీడేస్, యువత ఫేమ్), శ్వేతబసు ప్రసాద్ (కొత్తబంగారులోకం ఫేమ్) జంటగా శ్రీ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్ సమర్పణలో సాయికృష్ణ ప్రొడక్షన్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'కళావర్ కింగ్' అనే టైటిల్ ఖరారు చేశారు. సోమవారంనాడు సంస్థ కార్యాలయంలో ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన డి.ఎస్.రావు మాట్లాడుతూ, 'ద్రోణ' సినిమా తర్వాత తమ బ్యానర్ లో నిర్మిస్తున్న చిత్రమిదనీ, కథకు తగ్గ టైటిల్ ఇదనీ చెప్పారు. ఛాయాగ్రాహకుడు బాలమురుగన్, సంగీత దర్శకుడు అనిల్, దర్శకుడు సురేష్ వంటి మంచి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారని అన్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిందనీ, వాటిలో ఒకటి ఐటెం సాంగ్ అనీ, మరొకటి డ్యూయెట్ అనీ చెప్పారు. నిఖిల్, ఐటెం గార్లపై ఐటెం సాంగ్, నిఖిల్-శ్వేతబసుపై డ్యూయెట్ తీస్తామన్నారు. దర్శకుడు సురేష్ మాట్లాడుతూ, ఇది తనకు దర్శకుడుగా తొలిచిత్రమనీ, తాను తమిళుడనైనా యూనిట్ అంతా ఎంతో సహకరించిందనీ చెప్పారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ, నాన్ స్టాప్ అల్లరితో చాలా కలర్ ఫుల్ గా తన పాత్ర ఉంటుందన్నారు. పేకాటలో కళావర్ ఎప్పుడొస్తుందో తెలియదనీ, ఆ తరహాలో తన పాత్ర ఉంటుందనీ అన్నారు. చిత్రంలో వినోదంతో పాటు మంచి సెంటిమెంట్ కూడా ఉందన్నారు. సినిమాకు అన్నివిధాలా సరిపోయే టైటిల్ ఇదని చెప్పారు. చాలా సరదాగా ఈ చిత్రం ఉంటుందనీ, డిసెంబర్ లో సినిమాను విడుదల చేస్తామనీ సహ నిర్మాతలు శ్రీధర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో అజయ్, ఆలీ, వేణుమాధవ్, రఘుబాబు, ధర్మవరపు, ఆహుతి ప్రసాద్, కాశీ విశ్వనాథ్, గౌతంరాజు, సత్తెన్న, దువ్వాసి మోహన్, శివన్నారాయణ, సుమన్ శెట్టి, దేవీశ్రీ, ప్రగతి, శ్రుతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి చందు మాటలు, అనిల్ సంగీతం అందించారు.

No comments:
Post a Comment