నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో వైజయంతీ హౌస్ నుండి త్రీ ఎంజెల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'ఓం శాంతి'. శేషు ప్రియాంక చలసాని ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్రం ఆడియో డిసెంబర్ 5న విడుదల కానుంది. జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి.వైజయంతీ మూవీస్, ఇళయరాజా కాంబినేషన్ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. గతంలో 'ఆఖరి పోరాటం', 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అశ్వమేథం' వంటి మ్యూజికల్ హిట్స్ ఈ కాంబినేషన్ లో వచ్చాయి. ఆ కోవంలోనే 'ఓంశాంతి' కూడా మ్యూజికల్ గా సెస్సేషన్ క్రియేట్ చేసాలా ఇళయారాజా అద్భుతమైన పాటలు అందించారు. అలాగే అశ్వనీత్ సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాలు హిట్టవుతాయనే సెంటిమెంట్ కూడా ఉంది. 'అగ్నిపర్వతం', 'పెళ్లి సందడి' చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై విజయం సాధించినవే. దీనిని దృష్టిలో పెట్టుకుని వైజయంతీ హౌస్ నుంచి వస్తున్న 'ఓం శాంతి' చిత్రాన్ని సైతం జనవరి 13న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. 5 కథలు, 5 జీవితాలు, ఒక నిజం అనై ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ సరికొత్త ట్రెండ్ ను సృష్టించనుందని నిర్మాత శేషు ప్రియాంక తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో రవికాలే, రోహిత్ పాఠక్, రఘుబాబు, సునీల్, సుమన్ శెట్టి, ప్రగతి, రణధీర్, శివారెడ్డి, సారిక రామచంద్రరావు తదితిరులు నటించారు. నాగరాజు గంధం మాటలు, జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందించారు.
No comments:
Post a Comment