'ఆ ఒక్కడు' చిత్ర తర్వాత అజయ్ కథానాయకుడుగా నటించిన 'సారాయి వీర్రాజు' చిత్రం మళ్లీ విడుదల తేదీ మార్చుకుంది. తొలుత ఈనెల 19న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించినప్పటికీ కారణాంతరాల వల్ల రిలీజ్ తేదీని 27కు మార్చారు. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. తాజాగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. డిసెంబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి మాత్రం రిలీజ్ తేదీలో మార్పు ఉండదని తెలుస్తోంది. ఈ సీజన్ లో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్య-2' చిత్రం 27వ తేదీకి ఫిక్స్ కావడంతో 'సారాయి వీర్రాజు' వెనక్కి తగ్గాల్సి వచ్చింది.విశాలాక్షి క్రియేషన్స్ బ్యానర్ పై పి.ఆర్.కె.రావు నిర్మించిన 'సారాయి వీర్రాజు' చిత్రానికి డి.ఎస్.కణ్ణన్ దర్శకత్వం వహించారు. క్రిష్, రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కణ్ణన్ కు దర్శకుడిగా ఇది తొలిచిత్రం. గతవారంలోనే కణ్ణన్ వివాహం చేసుకున్నారు. ఈ చిత్రం ఫలితం ఆయనకు కీలకం కాబోతోంది. అలాగే 'ఆ ఒక్కడు' హీరోగా అజయ్ కు ప్లస్ కాలేదు. దీంతో ఆయన హీరోగా నిలబడాలంటే ఒక హిట్ అనివార్యమవుతోంది. ఈ చిత్రం ద్వారా రమ్య నంబిసన్ హీరోయిన్ గా పరిచయమవుతుండగా, మరో హీరోయిన్ గా మధులిక నటించింది. ఇందులో హీరో సారాయి అమ్మడంలోనే కాకుండా తాగడంలోనూ ముందుంటాడు. దాంతో అంతా అతన్ని సారాయి వీర్రాజని పిలుస్తుంటారు. అతని జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశించడంతో కథ మలుపు తిరుగుతుంది. సహజత్వానికి దగ్గరగా ఈ చిత్రంలోని పాత్రలు, లొకేషన్లు ఉంటాయనీ, హైద్రాబాద్, చెన్నై, నర్సీపట్నం, దుబాయ్ లలో షూటింగ్ జరిపామనీ, రియాలిటీ కోసం నర్సీపట్నానికి చెందిన 180 మందిని ఇందులో నటింపజేశామనీ చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో జోగినాయుడు, ధనరాజ్, సత్తెన్న, అజయ్ ఘోష్, ముమైత్ ఖాన్ తదితరులు నటించారు. విశ్వ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, శ్రీసాయి సంగీతం అందించారు
No comments:
Post a Comment