ట్రెండ్ కు తగిన సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు రవిబాబు మొదట్నించీ తన ప్రత్యేకతను చాకుంటున్నారు. 'అల్లరి', 'అమ్మాయిలు అబ్బాయిలు', 'సోగ్గాడు', 'అనసూయ', 'నచ్చావులే' వంటి చిత్రాలు ఆయనలోని క్రియేటివిటీని చాటాయి. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ 'అనసూయ' ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ చిత్రం తర్వాత మరోసారి 'అమరావతి' అనే థ్రిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రయిలర్స్ ఈ చిత్రంపై మరించి క్యూరియాసిటీని పెంచాయి. భూమిక, స్నేహ ప్రధాన పాత్రధఝారులుగా, నందమూరి తారకరత్న నెగిటివ్ తరహా పాత్రలో, రవిబాబు మరో కీలక పాత్రలో నటించిన చిత్రమిది. డిసెంబర్ 3న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ తెలిపారు.వైవిధ్యమైన థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రవిబాబు తెరకెక్కించారనీ, కథ-కథనాలు, చిత్రీకరణ చాలా ఆసక్తికరంగా ఉంటాయనీ ఆయన చెప్పారు. హాలీవుడ్ చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుందన్నారు. ఇందుకు తగ్గట్టే ఈ చిత్రంలో పాటలుండవనీ, నేపథ్య సంగీతమే సినిమాకి వెన్నుదన్నుగా నిలుస్తుందనీ తెలిపారు. ప్రస్తుతం డీటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు పూర్తి కావచ్చని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో గద్దె సింధూర, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, జి.వి.విశ్వనాథ్ కాశీ, రాఘువ, మధు తదితరులు నటించారు. సుధారకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
No comments:
Post a Comment