'జోష్' చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగచైతన్య మలి చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇంతవరకూ ఆ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ బయటకు రాలేదు. సోమవారంనాడు నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆ స్టిల్స్ విడుదల చేశారు. కృష్ణ సమర్పణలో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సంజయ్ స్వరూప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకుడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి న్యూయార్క్ , కేరళలో కొంత షూటింగ్ జరిపారు.చిత్ర విశేషాలను తొలిసారిగా గౌతమ్ వాసుదేవ మీనన్ తెలియజేస్తూ, ఇదొక అందమైన ప్రేమకథ అనీ, ఓ కొత్త కోణంలో ఉంటుందనీ చెప్పారు. నాగచైతన్య చక్కటి నటన ప్రదర్శిస్తున్నాడనీ, పెద్ద హీరో అవుతాడనే నమ్మకం ఉందనీ తెలిపారు. ఎ.ఆర్.రెహమాన్ అందిస్తున్న సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అవుతుందనీ, షూటింగ్ సైతం దాదాపు పూర్తి కావచ్చిందనీ చెప్పారు. నాగచైతన్యతో తమ బ్యానర్ లో చిత్రం రూపొందుతుండటం ఆనందంగా ఉందనీ, జనవరిలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామనీ సంజయ్ స్వరూప్ తెలిపారు. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడిగా సమంత నటిస్తోంది. ఇతర పాత్రల్లో కృష్ణుడు, దేవన్, సురేఖావాణి, లక్ష్మి, సుధీర్, త్రిష ఎలెక్స్ తదితరులు నటిస్తున్నారు. కథ-స్క్రీన్ ప్లే సైతం గౌతమ్ మీనన్ అందిస్తున్న ఈ చిత్రానికిఉమర్జీ అనూరాధ మాటలు, అనంత్ శ్రీరామ్ పాటలు, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, రాజీవన్ ఆర్ట్, ఫ్లెక్లి (లండన్) కార్లి లాంటియన్ (యుఎస్) కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
No comments:
Post a Comment