'ఓయ్' చిత్రం తర్వాత సిద్దార్ధ మళ్లీ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం కె.రాఘవేంద్రరావు బ్యానర్ లో ఆయన కుమారుడు ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రంలో సిద్దార్ధ నటిస్తున్నారు. ఆయనకు జోడిగా శ్రుతి కమల్ హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రోగ్రస్ లో ఉండగానే మరో కొత్త చిత్రానికి సిద్దార్ధ కమిట్ అయ్యారు. ఈ చిత్రాన్ని కీర్తి క్రియేష్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా రాంబాబు అనే యువకుడు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.కోడిరామకృష్ణ, ప్రభుదేవా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం రాంబాబుకు ఉంది. ప్రస్తుతం నటీనటులు ఎంపిక జరుగుతున్న ఈ చిత్రానికి 'బావ' అనే టైటిల్ నిశ్చయించారు. జనవరి 20న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment