స్టయిలిష్ హీరో అల్లు అర్జున్ మరోసారి 'ఆర్య-2' చిత్రంతో సంచలనాలు సృష్టించేందుకు సన్నద్ధమయ్యారు. 'పరుగు' వంటి హిట్ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో అభిమానులు సైతం ఎంతో ఉత్సుకతో ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడి ఈనెల 27న 'ఆర్య-2'గా అల్లు అర్జున్ అలరించబోతున్నారు. సోమవారంనాడు ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు జరిగి యు/ఏ సర్టిఫికెట్ లభించింది. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై ఆదిత్యబాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తారు.ఆల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో సంచలన విజయం సాధించిన 'ఆర్య-2' చిత్రానికి ఇది సీక్వెల్. అయితే కథలో పోలిక ఉందనీ, ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా ఇతివృత్తమని ఆదిత్య బాబు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని 350కి పైగా ప్రింట్లతో 800కు పైగా థియేటర్లలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అల్లు అర్జున్ కు మంచి క్రేజ్ ఉన్న ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆడియో సెన్సేషన్ హిట్ కావడంతో సినిమాపై మరింత అంచనాలు ఎక్కువయ్యాయి. ఇందులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా అల్లు అర్జున్ నటించగా, ఆయనకు జోడిగా కాజల్ నటించింది. నవదీప్-శ్రద్ధదాస్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళ హీరో ఆర్య విలన్ పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ అందించారు.
No comments:
Post a Comment