డాక్టర్ ఎం.మోహన్ బాబు నటవారసుడుగా 'విష్ణు' చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు సోమవారంనాడు మరో వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ ఏడాది తాను నటిస్తున్న 'సలీమ్' చిత్రం తన కెరీర్ కు మరో మంచి హిట్ అందిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.విష్ణు కెరీర్ లో సక్సెస్ అంత ఆషామాషీగా రాలేదు. 'సూర్యం', 'గేమ్' వంటి చిత్రాలు విష్ణుకు నటుడిగా మంచిపేరే తెచ్చినా బాక్సాఫీస్ సక్సెస్ మాత్రం రాలేదు. శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన 'ఢీ' చిత్రం తొలిసారిగా విష్ణు కెరీర్ కు మంచి సక్సెస్ అందించింది. ఆ చిత్రం తర్వాత 'కృష్ణార్జున' చిత్రంలో నాగార్జునతో కలిసి నటించారు. కమర్షియల్ హీరోగా తనకు వచ్చిన ఇమేజ్ ను కాపాడుకునేందుకు తన బాడీ లాంగ్వేజ్ ను కూడా మార్చుకుని ఇప్పుడు 'సలీమ్' చిత్రం కోసం స్లిమ్ గా మారారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్, రిలయెన్స్ బిగ్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రేమకథా చిత్రాలను హ్యాండిల్ చేయడంలో దిట్ట అయిన వై.వి.ఎస్.చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విష్ణుకు జోడిగా ఇలియానా నటించింది. 'దేవదాసు' తర్వాత వై.వి.ఎస్. బ్యానర్ లో ఇలియానా మరోసారి నటిస్తుండగా, మోహన్ బాబు ఇందులో అండవర్ వరల్డ్ డాన్ గా ఓ కీలక పాత్ర కూడా పోషించడం సినిమాపై మంచి అంచనాలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ రెండోవారంలో విడుదల చేసేందుకు నిర్మాత మోహన్ బాబు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం విష్ణుకు సక్సెస్ పరంగా బర్త్ డే గిఫ్ట్ అవుతుందని, టైటిల్ ట్యాగ్ లైన్ ను నిజం చేస్తూ దుమ్మురేపుతుందీ ఆశిద్దాం.
No comments:
Post a Comment