జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్, 'మిస్సమ్మ', 'అనసూయ' వంటి చిత్రాల్లో చక్కటి నట ప్రతిభను ప్రదర్శించిన భూమిక తొలిసారి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అమోద్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై పి.వనితా వాణి, ఎ.రాధికా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టేకుల క్రిపాకర్ రెడ్డిదర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తుది మెరుగల దశలో ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని 'కొత్తబంధం' అనే టైటిల్ ను అనుకుంటున్నారు. దీనికి 'మీరు నాకు అర్ధం కారు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది.భార్యాభర్తల మధ్య ఉండే ఫీలింగ్స్, భావోద్వేగాలు, అవగాహన వంటి అంశాల చుట్టూ అల్లుకున్న సకుటుంబ కథా చిత్రమిది. ఇందులో ప్రకాష్ రాజ్ జిల్లా కలెక్టర్ పాత్ర పోషిస్తుండగా, భూమిక ఎంబిఎ గ్రాడ్యుయేట్ గా కనిపిస్తారు. పరుచూరి సోదరులు సంభాషణలు రాసిన ఈ చిత్రానికి చిన్నా సంగీతం అందించారు. నిర్మాణాంతర కార్యక్రమాల పూర్తి చేసి డిసెంబర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
No comments:
Post a Comment