ఎన్టీఆర్, నయనతార, షీలా హీరోహీరోయిన్లుగా వైష్ణవీ ఆర్ట్స్ పతాకంపై కొడాలినాని సమర్పణలో వల్లభనేని వంశీ నిర్మిస్తున్న చిత్రం 'అదుర్స్'. వి.వి.వినాయక్ దర్శకుడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్యాచ్ వర్క్ పనులు జరుపుకొంటోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 3న నిర్వహించనున్నారు.'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత ఎన్టీఆర్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాటిక్ చిత్రమిదనీ, ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా చక్కటి సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని వినాయక్ తెరకెక్కించారనీ నిర్మాతలు తెలిపారు. ఎన్టీఆర్ సరికొత్త లుక్ తో డైనమిక్ గా ఇందులో కనిపిస్తారనీ, ఆయన ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనీ, పూర్తి ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ వారు తెలిపారు. దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారనీ, ఆడియో సెస్సేషన్ సృష్టిస్తుందనీ అన్నారు. డిసెంబర్ మూడోవారంలో సినిమా విడుదలకు ప్లానింగ్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, తనికెళ్ల భరణి, మహేష్ మంజ్రేకర్, నాజర్, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ముకుల్ దేవ్, సుప్రీత్, రమాప్రభ తదితరులు నటించారు. కోనవెంకట్ కథ-మాటలు, చంద్రబోస్-కులశేఖర్-రామజోగయ్య శాస్త్రి పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, స్టన్ శివ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్ అందించారు.
No comments:
Post a Comment