'జోష్' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగచైతన్య నటుడిగా తొలి బర్త్ డేను సోమవారంనాడు జరుపుకొంటున్నారు. నాగచైతన్య పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు వరద బాధితుల సహాయార్థం లక్ష రూపాయలు విరాళంగా అందించారు. వరదల్లో సర్వం కోల్పోయిన 10 కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి 10 వేల రూపాయలు చొప్పున అందజేసారు. ఆలిండియా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ విరాళాన్ని అందజేసింది. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి నాగచైతన్య కేక్ కట్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు.అసోసియేషన్ హైద్రాబాద్ ఇన్ చార్జి రవీందర్ రెడ్డి, 'జేమ్స్ ఫౌండేషన్' చైర్మన్ మధుమోహన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగచైతన్య ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఇందిరా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం కోసం చెన్నైలో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు.
No comments:
Post a Comment