హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలకు మళ్లీ తెలుగులో క్రేజ్ వచ్చింది. '2012' చిత్రం ఆంగ్ల, తెలుగు, హిందీ వెర్షన్లలో ఇటీవల విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టుకోవడంతో పలు ఆంగ్ల చిత్రాలను మళ్లీ తెలుగులోకి అనువదించి విడుదల చేసేందుకు నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే హాలీవుడ్ లో విజయవంతమైన 'ది ట్విటైల్ సాగా - న్యూ మూన్' చిత్రాన్ని పి.వి.ఆర్. థియేటర్స్ గ్రూప్ 'అమావాస్య' పేరుతో అనువదించి డిసెంబర్ 11న ఆంధ్రదేశమంతటా విడుదల చేయనుంది.క్రిస్టిన్ స్టెవార్డ్, రోబర్ట్ ప్యాటిన్ సన్, టైలర్ లూధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి క్రిస్ విడ్జ్ దర్శకత్వం వహించారు. స్టీఫిన్ మెయర్ రొమాంటిక్ థ్రిల్లర్ 'న్యూ మూన్' నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బిజినెస్ పరంగానూ ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చిందనీ, కలెక్షన్ల పరంగానూ ఇండియాలో రికార్డులు సృష్టించడం ఖాయమనీ పి.వి.ఆర్. థియేటర్స్ గ్రూప్ ప్రతినిధులు తెలిపారు
No comments:
Post a Comment