మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అతిథి' తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ లో ఓ కొత్త చిత్రం రూపుదిద్దుకోనుంది. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి 'మిస్టర్ పెర్ ఫెక్ట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు.మహేష్ బాబు ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, కథ వినగానే ఉత్కంఠకు లోనయ్యాననీ, తన కెరీర్ లో ఇది మరో సెన్సేషనల్ మూవీ అవుతుందనీ చెప్పారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, సూపర్ స్టార్ మహేష్ బాబుతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 40 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నామనీ, తెలుగు సినీ పరిశ్రమలోనే నభూతో నభవిష్యతి అనిపించే రీతిలో ఈ చిత్ర నిర్మాణం ఉంటుందనీ చెప్పారు. మహేష్ బాబును కొత్త డైమన్షన్ లో చూపింే ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ లో ప్రారంభమవుతుందని, ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందనీ తెలిపారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్ లో చేసిన 'కిక్' సూపర్ హిట్ అయినట్టే మహేష్ బాబుకు కూడా ఘనవిజయం ఇవ్వాలే పట్టుదలతో ఉన్నట్టు సురేందర్ రెడ్డి తెలిపారు.
No comments:
Post a Comment