జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ ప్రధాన పాత్రల్లో లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'మా నాన్న చిరంజీవి' (అంటే పేద్ద హీరో). అరుణ్ ప్రసాద్ దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. విశాఖ టాకీస్ పతాకంపై నట్టికుమార్ ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనురాగాలు, ఆప్యాయతలను ప్రధానంగా తీసుకుని ఈ చిత్రాన్ని అరుణ్ ప్రసాద్ తెరకెక్కించారనీ, జగపతిబాబు ఇందులో చిరంజీవులు అనే పాత్రలో నటించారనీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత గిరి తెలిపారు. తమ సంస్థ తొలి ప్రయత్నంగా ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసిన తర్వాత మార్కెటింగ్ కు వచ్చే సరికి నట్టికుమార్ ను సంప్రదించామనీ, తమ మీద ఉన్న నమ్మకంతో సినిమా రిలీజ్ కు మందుకు వచ్చిన ఆయనకు తన కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాననీ అన్నారు. తమ సంస్థ ద్వారా ఒక మంచి చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందనీ, జగపతిబాబు నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ అవుతుందనీ నట్టికుమార్ పేర్కొన్నారు. డిసెంబర్ 5న ఆడియో విడుదల చేసి, 25న క్రిస్మస్ కానుకగా 90 ప్రింట్లతో సినిమా రీలీజ్ చేస్తామనీ చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఝాన్సీ, ఎమ్మెస్ నారాయణ తదితరులు నటించారు. భరణి కె.ధరణ్ సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందించారు.
No comments:
Post a Comment