నయనతార క్యాంప్ మార్చింది. నందమూరి యంగ్ స్టార్ ఎన్టీఆర్ సరసన 'అదుర్స్'లో నటిస్తున్న నయనతార ఆ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో బాలకృష్ణ క్యాంప్ లో చోటు సంపాదించున్నట్టు సినీ వర్గాల సమాచారం. యునైటెడ్ మూవీస్ పతాకంపై బాలకృష్ణ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్న 'సింహా' చిత్రంలో మూడో హీరోయిన్ గా నయనతారను ఖరారు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ చిత్రంలో స్నేహ ఉల్లాల్, నమిత హీరోయిన్లుగా నటిస్తుండగా నయనతార రాకతో 'సింహా' మరింత గ్లామర్ లుక్ సంతరించుకోనుంది.సింహం రెండడుగులు వెనక్కి వేసేది పదడుగులు ముందుకు దూకడానికేననీ, ఆ లక్షణాలన్నీ ఇందులో బాలయ్య పాత్రలో ఉంటాయనీ, బాలకృష్ణను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా ఆయన పాత్ర చిత్రణ ఉంటుందనీ దర్శకుడు బోయపాటి శ్రీను చెబుతున్నారు. 'భద్ర', 'తులసి' వంటి హిట్ల తర్వాత బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండటం, బాలకృష్ణ న్యూ గెటప్ ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలను రేకెత్తిస్తోంది. రామోజీ ఫిల్స్ సిటీలో ఏకథాటిగా జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ లో పూర్తవుతుంది. బాలకృష్ణకు ఉన్న సంక్రాంతి హిట్ సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకుని 2010 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత పరుచూరి కిరీటి తెలిపారు. డిసెంబర్ లో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రానికి ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, చక్రి సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment