'గంగ్రోతి'తో మొదలుపెట్టి 'పరుగు' వరకూ సక్సెస్ ఫుల్ పయనం సాగించిన అల్లు అర్జున్ 'ఆర్య-2' తో ఎలాంటి ప్రభంజనం సృష్టించనున్నారనేది ఇప్పుడు అందర్నీ ఆసక్తిగా ఎదురుచూసేలా చేస్తోంది. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కెరీర్ ప్రారంభంలో వచ్చిన 'ఆర్య' చిత్రం అప్పట్లో మంచి హిట్. అల్లు అర్జున్ ఎలాంటి క్యారెక్టర్లకు బాగా సూటవుతారనడానికి ఈ చిత్రం బాగా ఉపకరించింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'ఆర్య'కు సీక్వెల్ 'ఆర్య-2' వస్తుండటం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. థియేటర్లకు రాకముందే ప్రీమియర్ షో కోసం ఫ్యామిలీ ఆడియెన్స్, ముఖ్యంగా మహిళాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'ఫీల్ మై లవ్' అంటూ హీరోయిన్ చుట్టూ తిరిగి ఎట్టకేలకు ఆమెను తనవైపు ఆకట్టుకునే పాత్రలో అల్లు అర్జున్ 'ఆర్య' లో నటించారు. అయితే సీక్వెల్ కథాంశం ఎలా ఉండబోతోందనేది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రను ఇందులో పోషిస్తున్నారు. ఆయన చిన్ననాటి ఫ్రెండ్ నవదీప్. సహజంగానే ఇద్దరి మధ్యా ఎప్పుడు పోటీ వచ్చినా అల్లు అర్జున్ దే పైచేయి. ఇదే క్రమంలో నవీదీప్ అందాల కాజల్ ను ప్రేమిస్తాడు. ఇందుకు తన మిత్రుడు అల్లు అర్జున్ సహాయం అడుగుతాడు. సిన్సియర్ గానే ఈ ఇద్దర్నీ దగ్గర చేయాలనే ప్రయత్నం చేసిన అల్లు అర్జున్ ఆ క్రమంలో ఆమె ప్రేమిస్తుంది తననేనని తెలుసుకుంటాడు. సుకుమార్ ఈ కథను తనదైన శైలిలో చక్కటి స్క్రీన్ ప్లే తో మలిచారట. కథ వింటుంటే...'ఆర్య'కు దగ్గరగా ఉన్నట్టు లేదూ
No comments:
Post a Comment