'బంపర్ ఆఫర్' చిత్రం తర్వాత సాయిరామ్ శంకర్ హీరోగా ఎస్.వి.ఆర్. మీడియా సమర్పణలో సద్దురు సినిమా, వీరూ క్రియేషన్స్ పతాకంపై వీరేష్ బాబు, రఘనాథ్ సోగి సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'వాడే కావాలి'. రాజేంద్ర దర్శన్ దర్శకుడు. ఈ చిత్రం తొలికాపీ రెడీ అవుతోంది.ఎస్.వి.ఆర్. మీడియా సిఇఓ శోభారాణి ఈ విషయాన్ని తెలియజేస్తూ, సాయిరామ్ శంకర్ ప్రతిభావంతమైన నటన, ఆర్.పి.పట్నాయక్ సూపర్ హిట్ మ్యూజిక్ తో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందిందని చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందనీ, 'బంపర్ ఆఫర్' తర్వాత సాయిరాం శంకర్ కు ఇది మరో బంపర్ హిట్ చిత్రమవుతుందనీ అన్నారు. డిసెంబర్ 11న ఆంధ్ర రాష్ట్రమంతటా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సుహాసి కథానాయిక కాగా, నరేష్, వేణుమాధవ్, ఆలీ, చంద్రహాస్, కోట శంకర్ రావు, చిత్రం శ్రీను, రఘబాబు, శ్రీనివాసవర్మ, రవిప్రకాష్, హేమ తదితరులు నటించారు. కల్యాణ్ సమి సినిమాటోగ్రఫీ, కె.వి.కృష్ణారెడ్డి ఎడిటింగ్, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ అందించారు.
No comments:
Post a Comment