వందన ఆర్ట్స్ పతాకంపై నిర్మాత శ్రీకాంత్ ఓ ప్రేమకథా చిత్రాన్ని అందిస్తున్నారు. వీరప్రసాద్ నీలం దర్శకుడు. చైతన్య, అక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో బుధవారంనాడు జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇవ్వగా, శ్రీనువైట్ల కెమెరా స్విచ్చాన్ చేశారు.దర్శకుడు వరప్రసాద్ మాట్లాడుతూ, దాసరి, శ్రీనువైట్ల వద్ద తాను దర్శకత్వ శాఖలో పనిచేశాననీ, 'అడుగు' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన తనకు ఇది రెండో చిత్రమనీ తెలిపారు. యూత్ ఫుల్ కథాశంతో ఈ చిత్రం ఉంటుందనీ, డిసెంబర్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనీ చెప్పారు. మంచి కథాంశంతో సినిమా తీయాలనే ఉద్దేశంతో పలు కథలు విన్నాననీ, వరప్రసాద్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందనీ నిర్మాత శ్రీకాంత్ తెలిపారు. ఈ చిత్రం తమకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నట్టు చైతన్య, అక్ష పేర్కొన్నారు.
No comments:
Post a Comment