తొలి చిత్రం 'జోష్'పై ఎన్నో హోప్స్ పెట్టుకున్న సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక ఆ సినిమా ఫలితం నిరాశపరచడాన్ని స్పోర్టివ్ గానే తీసుకుంటోంది. ఇష్టపడి చేసిన పని కావడం వల్ల ఫలితంపై విచారం లేదని కార్తీక ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. కార్తీక ఇప్పుడు ప్రముఖ చిత్రకారుడు రాజా రవి వర్మ జీవిత చరిత్రతో రూపొందుతున్న 'మకర మంజు' చిత్రం ద్వారా మలయాళ పరిశ్రమలోకి కూడా అడుగుపెడుతోంది
అమ్మ రాధ, పెద్దమ్మ అంబిక ఒకప్పుడు పేరున్న హీరోయిన్లు అయినప్పటికీ నటిని కావాలని తాను అనుకోలేదనీ, రెండేళ్ల క్రితం టెన్త్ క్లాస్ పూర్తి చేసినప్పటి నుంచి తనకు సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయని కార్తిక చెప్పుకొచ్చింది. అయితే 'జోష్' చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెడుతున్న నాగచైతన్య సరసన నటించే అవకాశం రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పింది. 'నాగచైతన్య తొలి చిత్రం కావడంతో ఆ సినిమాలో నాకు పెద్దగా చేయడానికి ఏమీ ఉండదనే విషయం తెలుసు. ముందునుంచి క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమనేది నా నమ్మకం. ఇష్టపడి చేసిన సినిమా కావడంతో ఫలితం గురించి ఎలాంటి విచారం లేదు' అని తెలిపింది. మంచి సబ్జెక్ట్, గొప్ప టీమ్ కావడంతోనే 'మకర మంజు' చిత్రంతో మలయాళంలోకి అడుగుపెడుతున్నానని పేర్కొంది. ఆర్ట్ చిత్రాలు తీయడంలో నిష్ణాతుడైన లెనిన్ రాజేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రానికి మధు అంబట్ వంటి ప్రముఖుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారనీ, అలాగే రాజా రవివర్మగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ నటిస్తున్నారనీ చెప్పారు. ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసమే ఈ చిత్రం ఉద్దేశించి ఉండవచ్చనీ, అయితే ఒక చక్కటి చిత్రం ద్వారా మలయాళంలో కెరీర్ ప్రారంభించనుండటం, అది కూడా కెరీర్ ప్రారంభంలో ఈ అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉందనీ చెప్పుకొచ్చింది. రాజా రవి వర్మ ఇతివృత్తంతో 'రంగ్ రసియా' చిత్రం వచ్చిన విషయాన్ని ప్రస్తావించినప్పుడు, రాజా రవి వర్మకు సంబంధించి మరింత విస్తారమైన సమాచారంతో రూపొందుతున్న చిత్రమిదని సమాధానమిచ్చింది 'రంగ్ రసియా'లో నందితా దాత్ తరహాలో కార్తీక స్కిన్ షో చేస్తుందా? లేదనే చెబుతోంది కార్తీక. 'ఇదో సెన్సువల్ ఫిల్మ్. సెక్సువల్ గా ఉండదు' అంటూ తేల్చిచెప్పింది.
No comments:
Post a Comment