ప్రముఖ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్స్ స్మృత్యర్థం 'ఆర్య-2' చిత్రాన్ని అంకితమిస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడుగా ఆదిత్య మూవీస్ పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య బాబు నిర్మించిన ఈ చిత్రం ఈనెల 27న విడుదలవుతోంది. సుకుమార్ దర్శకుడు. రిలీజ్ తేదీ, చిత్ర విశేషాలను ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్రయూనిట్ తెలియజేసింది. అల్లు అర్జున్, బివిఎస్ఎన్ ప్రసాద్, ఆదిత్యబాబు, సుకుమార్, బిగ్ సి ప్రతినిధి స్వప్నకుమార్ పాల్గొన్నారు.ఆదిత్యబాబు మాట్లాడుతూ, 'ఆర్య' చిత్రానికి ఇదెంతమాత్రం సీక్వెల్ కాదనీ, ఆర్య క్యారెక్టర్ మాత్రమే ఉంటూ కథ కొత్తగా ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రం తర్వాత అల్లు అర్జున్ కు సూపర్ స్టార్ కు మించిన ఇమేజ్ వస్తుందన్నారు. ఆడియో పెద్ద హిట్ అయిందనీ, సినిమా కూడా అంతకుమించి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాననీ సుకుమార్ పేర్కొన్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ, సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, ఆర్య-2 మ్యూజిక్ పెద్ద హిట్టయిందనీ సంగీతప్రియులంతా చెబుతున్నారనీ అన్నారు. 'ఆర్య' చిత్రంలో 'అ అంటే అమలాపురం' పాట పెద్ద హిట్ అనీ, ఈ సినిమాకి 'రింగా రింగా' వంటి చార్ట్ బస్టర్ సాంగ్ దేవీశ్రీప్రసాద్ ఇచ్చారనీ అల్లు అర్జున్ చెప్పారు. ఇది నూటికి 200 శాతం సుకుమర్ సినిమా అనీ, సినిమా సక్సెస్ పై చాలా ధీమాగా ఉన్నాననీ అన్నారు. 27వ తేదీ కోసం తాను కూడా ఎదురుచూస్తున్నానని చెప్పారు. మైఖేల్ జాక్సన్ కు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్టు తొలి కార్డ్ వేస్తున్నట్టు తెలిపారు.
No comments:
Post a Comment