'తారే జమీన్ పర్' వంటి సబ్జెక్ట్ లతో ప్రయోగాలు చేసే దమ్ము తెలుగు హీరోలకు లేదంటూ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఆయనను చిక్కుల్లో పెట్టినట్టే కనిపిస్తోంది. ఎవరైనా అలాంటి సబ్జెక్ట్ తో వచ్చినా, ఆ రైట్స్ తెచ్చినా వెంకటేష్ తో తీసేందుకు సిద్ధమని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, మంచి కథకులు, దర్శకులు దొరికితే సొంతంగా నిర్మించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జగపతిబాబు, ఇలాంటి అవకాశం వస్తే నేను ఎప్పుడూ రెడీనే అంటూ మోహన్ బాబు ఇప్పటికే ప్రతిస్పందించారు. తమ్మారెడ్డి ఎందుకోసం ఇలా వ్యాఖ్యానించారోనని ఆశ్చర్యం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. తాజాగా తమ్మారెడ్డి పై మరో బౌన్స్ వచ్చిపడింది. ఎ.పి.సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఓ.కల్యాణ్ ఓ బహిరంగ లేఖలో తమ్మారెడ్డి వ్యాఖ్యాలను ఘాటుగా తిప్పికొట్టారు. ఆ లేఖను ఆయన పత్రికల ముందుంచారు కూడా.తమ్మారెడ్డి చెబుతున్నటు వంటి సబ్జెక్ట్ లతో ఆయన ఎప్పుడైనా, ఏ నటులలైనా సంప్రదించారా? అని ఓ.కల్యాణ్ తన లేఖలో ప్రశ్నించారు. తెలుగులో వచ్చిన 'ఆ నలుగురు', 'మీ శ్రేయోభిలాషి' వంటి ఉత్తమాభిరుచి ఉన్న చిత్రాలను ఆయన చూసి ఉండకపోవచ్చనీ, టాలీవుడ్ లో పిరికిపందలు ఉన్నారని చెప్పడం కంటే ఆయనే సొతంగా అలాంటి సబ్జెక్ట్ లతో ప్రయోగాలు చేయడం మంచిందనీ ఆయన సూచించారు. తమ్మారెడ్డి ప్రతిస్పందన ఏమిటనేది చూడాలి
No comments:
Post a Comment