'తారే జమీన్ పర్..వంటి చిత్రాలు చేసేందుకు తెలుగు హీరోలకు గట్స్ లేవు. బాలీవుడ్ హీరోలే మగాళ్లు' అంటూ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చంటూ పలువురు హీరోలు కొట్టిపారేస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనే కోరిక తనకుందని, ఎవరైనా ముందుకు వస్తే నేను రెడీ అనీ హీరో జగపతిబాబు చెబితే...మీరంటున్న చిత్రాల రైట్స్ పట్రండి...వెంకటేష్ తో సినిమా తీస్తానంటూ ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు స్పందించారు.మంచి సినిమాలు తెలుగులోనే వస్తున్నాయని బాలీవుడ్ వాళ్లంటున్నారనీ, ఇప్పటికైనా సరై 'తారే జమీన్' లాంటి కథ తెచ్చినా, ఆ సినిమా రైట్స్ పట్టుకొచ్చినా వెంకటేష్ ను హీరోగా పెట్టి సొంతంగా సినిమా తీయడానికి రెడీగా ఉన్నాననీ సురేష్ బాబు వ్యాఖ్యానించారు. హీరోగా నటిస్తూనే మల్టీస్టారర్స్ చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయని జగపతిబాబు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 'తారే జమీన్ పర్', 'లగాన్' వంటి సినిమాల్లో చేయాలని తనకు కూడా ఉందనీ, అలాంటి కథలు తయారు చేసే రచయితలు, ఆ స్థాయిలో సెల్యులాయెడ్ కు ఎక్కించగల దర్శకులు కనిపించడం లేదనీ, అలా ఎవరైనా ముందుకు వస్తే సొంతంగా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాననీ జగపతిబాబు చెప్పారు. మొత్తానికి తమ్మారెడ్డి వ్యాఖ్యల ఉద్దేశం ఏమైనప్పటికీ...కాలం కలిసొస్తే అలాంటి సినిమాలు మన హీరోలనుంచి వస్తాయనే సంకేతాలు రావడం మాత్రం శుభపరిణామమే.మేమూ హీ'మాన్'లమే!
'తారే జమీన్ పర్..వంటి చిత్రాలు చేసేందుకు తెలుగు హీరోలకు గట్స్ లేవు. బాలీవుడ్ హీరోలే మగాళ్లు' అంటూ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చంటూ పలువురు హీరోలు కొట్టిపారేస్తున్నారు. ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనే కోరిక తనకుందని, ఎవరైనా ముందుకు వస్తే నేను రెడీ అనీ హీరో జగపతిబాబు చెబితే...మీరంటున్న చిత్రాల రైట్స్ పట్రండి...వెంకటేష్ తో సినిమా తీస్తానంటూ ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు స్పందించారు.మంచి సినిమాలు తెలుగులోనే వస్తున్నాయని బాలీవుడ్ వాళ్లంటున్నారనీ, ఇప్పటికైనా సరై 'తారే జమీన్' లాంటి కథ తెచ్చినా, ఆ సినిమా రైట్స్ పట్టుకొచ్చినా వెంకటేష్ ను హీరోగా పెట్టి సొంతంగా సినిమా తీయడానికి రెడీగా ఉన్నాననీ సురేష్ బాబు వ్యాఖ్యానించారు. హీరోగా నటిస్తూనే మల్టీస్టారర్స్ చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయని జగపతిబాబు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. 'తారే జమీన్ పర్', 'లగాన్' వంటి సినిమాల్లో చేయాలని తనకు కూడా ఉందనీ, అలాంటి కథలు తయారు చేసే రచయితలు, ఆ స్థాయిలో సెల్యులాయెడ్ కు ఎక్కించగల దర్శకులు కనిపించడం లేదనీ, అలా ఎవరైనా ముందుకు వస్తే సొంతంగా నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాననీ జగపతిబాబు చెప్పారు. మొత్తానికి తమ్మారెడ్డి వ్యాఖ్యల ఉద్దేశం ఏమైనప్పటికీ...కాలం కలిసొస్తే అలాంటి సినిమాలు మన హీరోలనుంచి వస్తాయనే సంకేతాలు రావడం మాత్రం శుభపరిణామమే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment