skip to main |
skip to sidebar
ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరపడింది. ఇదిగో...అదిగో అంటూ ఏడాది పాటు షూటింగ్ లాగించిన దర్శకుడు సుకుమార్ ఎట్టకేలకు 'ఆర్య-2' చిత్రాన్ని జనం ముందుకు తీసుకువస్తున్నారు. 'జోష్' సమయంలో ఈ సినిమా రిలీజ్ అవుతుందనీ, 'మగధీర' 50 డేస్ రన్ తర్వాత అనీ...సెంచరీ కొట్టిన తర్వాత వస్తుందనీ...ఎప్పటికప్పుడు 'ఆర్య-2' రిలీజ్ పై వాయిదాల మీద వాయిదా వేస్తూ చివరకు ఈనెల 25న రిలీజ్ అవుతుందని నిర్మాత ప్రకటించిన తర్వాత కూడా రెండ్రోజులు లేటు అయింది. ఇంకెత మాత్రం జాప్యం జరుగకుండా ఇప్పుడు ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ అయింది. ఒకటి రెండ్రోజుల్లో సెన్సార్ కు వెళ్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయబోతున్నారు. రిలీజ్ తేదీ యాడ్ లు, థియేటర్లు కూడా కన్ ఫర్మ్ చేసేశారు.'ఫీల్ మై లవ్' అంటూ అల్లు అర్జున్ హీరోయిన్ వెంటబడి ఎట్టకేలకు తన ప్రేమను పండించుకున్న'ఆర్య' చిత్రానికి సీక్వెల్ గా మళ్లీ సుకుమార్ కాంబినేషన్ లోనే ఈ చిత్రం తెరకెక్కింది. ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై ఆదిత్యబాబు, భోగవల్లి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది 'ఆర్య' కథతో సంబంధంలేని వైవిధ్యమైన ప్రేమకథా ఇతివృత్తమనీ, అల్లు అర్జున్ స్టామినాను చాటిచెప్పే చిత్రమవుతుందనీ ఆదిత్యబాబు చెబుతున్నారు. ఇప్పటికే ఆడియో పెద్ద హిట్ కావడంతో సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ సరసన కాజల్ కథానాయికగా నటించగా, మరో జంటగా నవదీప్, శ్రద్ధాదాస్, విలన్ పాత్రలో తమిళ హీరో ఆర్య నటించారు. ఈ చిత్రానికి ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, దేవీశ్రీప్రసాద్ ఎడిటింగ్ అందించారు. 'మగధీర' తర్వాత మళ్లీ అంత హిట్ రాలేదని అంతా అనుకుంటున్న తరుణంలో వస్తున్న 'ఆర్య-2' ప్రభంజనం సృష్టిస్తుందేమో చూడాలి.
No comments:
Post a Comment