యువసామ్రాట్ నాగార్జున ఈసారి సెంటిమెంట్ జోలికి వెళ్లబోవడం లేదు. డిసెంబర్ సెటిమెంట్ ను దూరంగా పెట్టి సంక్రాంతి బరిలోకి దూకుతున్నారు. నాగార్జున కథానాయకుడుగా కిరణ్ దర్శకత్వంలో శ్రీ కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త చిత్రం జనవరి రెండో వారంలో రిలీజ్ కానుంది. 2010లో సంస్థ సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా కావడంతో సంక్రాంతి రీలీజ్ కు వెళ్తున్నట్టు చిత్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు.నాగార్జున ఇంతవరకూ చేయనటువంటి 'గ్లాంబర్' తరహా పాత్రలో ఇందులో పోషిస్తుండటంతో ఈ చిత్రానికి 'రమ్మీ' అనే టైటిల్ మొదట్నించీ ప్రచారంలోకి వచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'మోసగాడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. గతంలో శోభన్ బాబు, చిరంజీవి ప్రధాన పాత్రలో 'మోసగాడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ టైటిల్ పరిశీలనలో ఉండటం, నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ కావడం కూడా సినిమాపై మరింత క్రేజ్ పెంచే అవకాశాలున్నాయి. గోవాలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. మమతా మోహన్ దాస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారురమ్మీ కాదు...మోసగాడు!
యువసామ్రాట్ నాగార్జున ఈసారి సెంటిమెంట్ జోలికి వెళ్లబోవడం లేదు. డిసెంబర్ సెటిమెంట్ ను దూరంగా పెట్టి సంక్రాంతి బరిలోకి దూకుతున్నారు. నాగార్జున కథానాయకుడుగా కిరణ్ దర్శకత్వంలో శ్రీ కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న కొత్త చిత్రం జనవరి రెండో వారంలో రిలీజ్ కానుంది. 2010లో సంస్థ సిల్వర్ జూబ్లీ ఇయర్ కూడా కావడంతో సంక్రాంతి రీలీజ్ కు వెళ్తున్నట్టు చిత్ర నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు.నాగార్జున ఇంతవరకూ చేయనటువంటి 'గ్లాంబర్' తరహా పాత్రలో ఇందులో పోషిస్తుండటంతో ఈ చిత్రానికి 'రమ్మీ' అనే టైటిల్ మొదట్నించీ ప్రచారంలోకి వచ్చారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'మోసగాడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. గతంలో శోభన్ బాబు, చిరంజీవి ప్రధాన పాత్రలో 'మోసగాడు' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ టైటిల్ పరిశీలనలో ఉండటం, నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ కావడం కూడా సినిమాపై మరింత క్రేజ్ పెంచే అవకాశాలున్నాయి. గోవాలో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతోంది. మమతా మోహన్ దాస్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment