కృష్ణ భగవాన్, వేణుమాధవ్, షరీఫ్, సైరాభాను, ప్రేమ, మధుమిత ప్రధాన తారాగణంగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'టిక్ టిక్ టిక్'. అరుణకాంత్ దర్శకత్వంలో అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి అరుణకుమారి నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం డిటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.దర్శకుడు మాట్లాడుతూ, తెలుగులో ఇంతవరకూ రాని సరికొత్త కథ, కథనాలతో ఆద్యంతం థ్లిల్లింగ్ గా సాగే చిత్రమిదనీ, థ్రిల్లర్ చిత్రాల్లోనే సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. ఇందులో ఓ ప్రముఖ నటుడు ప్రత్యేకమైన సస్పెన్స్ పాత్రల్లో నటించడం ఓ విశేషమని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోలో సెట్స్ పైన ఈ చిత్రంలోని పాటలు చిత్రీకరించామనీ, పూర్ణిమరాయ్ పై తీసిన ఐటెం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. ఇటీవల అనుష్క ఆవిష్కరించిన ఆడియో శ్రోతలను ఎంతగానో ఎలరిస్తోందన్నారు. మిక్సింగ్ కార్యక్రమాలు పూర్త చేసి త్వరలోనే సినిమా విడుదల చేస్తామని చెప్పారు. ఈ సినిమాలో హీరో ఎవరనేది తెలియకపోవడమే పెద్ద సస్పెన్సనీ, అది తెలియాలంటే సినిమా చూడాల్సిందేననీ నిర్మాత పేర్కొన్నారు. ఇటీవల విజువల్ ఎపెక్ట్స్ కెనడాలో జరిపినట్టు చెప్పారు. ఈ చిత్రానికి సీతారామరాజు మాటలు, రాంబాబు గోపాల పాటలు, ఎస్.డి.జాన్ సినిమాటోగ్రఫీ, కానూరి సంగీతం అందిస్తున్నారు
No comments:
Post a Comment