హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ చిత్రాలకు లభిస్తున్న ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకుని మరో సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. 'సంగమం' చిత్రం ద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టిన గద్దె సింధూర కథానాయికగా 'కిల్లర్' పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై నగేష్ నారదాసి దర్శకత్వంలో కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల టాకీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మరో రెండు పాటల బ్యాలెన్స్ వర్క్ పూర్తి కావలసి ఉంది.అటవీ ప్రాంతాల్లో వరుస హత్యలకు కారకులు ఎవరు? దేనికోసం హత్యలు జరుగుతున్నాయనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందనీ, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో వైవిధ్యభరితంగా దీనిని తెరకెక్కిస్తున్నామనీ దర్శకుడు నారదాసి తెలిపారు. గద్దె సింధూర పాత్రోచితంగా మంచి నటన ప్రదర్శించిందనీ, ఆమెకు మంచి పేరు వస్తుందనీ అన్నారు. ఇదే నెలలో బ్యాలెన్స్ ఉన్న రెండు పాటలు చెన్నై, ముంబైలో చిత్రీకరించిఆడియో రిలీజ్ చేస్తామన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసి ఉగాది కానుకగా సినిమా విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి మధు ఎ.నాయుడు సినిమాటోగ్రఫీ, జె.పి. కళాదర్శకత్వం, నందు ఫైట్స్, ప్రదీప్ ఆంటోని కొరియోగ్రఫీ, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment