అవితేజ్, త్రినాథ్, పార్వతి, వైనవిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్స్ నెంబర్ 3గా ఇవివి కంభన్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జాయ్'. దర్శకత్వ శాఖలో అనుభవం ఉన్న బి.రాజా దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధం చేస్తున్నారు.దర్శకుడు రాజా మాట్లాడుతూ, కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు స్నేహంగా ఉంటారనీ, వారి మధ్య ప్రేమ చిగురిస్తుందనీ, అయితే అది తమ స్నేహానికి మచ్చకాకూదనే అభిప్రాయం వారిలో ఉంటుందనీ అన్నారు. ఈ క్రమంలో వారి స్నేహం గెలిచిందా, ప్రేమ గెలిచిందా అనేది ఆసక్తికరంగా ఉంటుందన్నారు. ఇవాల్టి యూత్ ట్రెండ్ కు అనుగుణంగా ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పారు. ఇందులో సునీల్ క్యారెక్టర్ హైలైట్ అవుతుందనీ, ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన విద్యాసాగర్ ఇందులో సిట్యుయేషనల్ మ్యూజిక్ అందించారనీ తెలిపారు. ఇది దర్శకుడి తొలి చిత్రమై అయినా చాలా కాన్ఫిడెంట్ తో చేశారని నిర్మాత కంభన్ తెలిపారు. పాటలన్నీ బాగా వచ్చాయనీ, మలేసియాలోని అందమైన లొకేషన్లలో రెండు పాటలు, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక పబ్ సాంగ్, వైజాగ్ లో ఒక పాట, కొంత టాకీ, హైద్రాబాద్ లో మరో పాట తీశామన్నారు. యూత్ చిత్రాల్లో 'జాయ్' ఓ ట్రెండ్ సృష్టిస్తుందనీ, సంక్రాంతి కానుకగా సినిమారిలీజ్ చేస్తామనీ చెప్పారు. వెన్నెరాడై మూర్తి, రేఖ, సూరి, బెనర్జీ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి స్వర్ణ సుధాకర్ మాటలు, భువనచంద్ర పాటలు, ఆకాష్ అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీ, వి.టి.విజయన్ ఎడిటింగ్ అందించారు.
No comments:
Post a Comment