కృష్ణుడు, శరణ్య జంటగా రూపొందిన మూన్ వాటర్ పిక్ర్స్ పతాకంపై రూపొందిన 'విలేజ్ లో వినాయకుడు' చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుని 12 సెంటర్లలో ప్రదర్శితమవుతోందని నిర్మాత మహి, దర్శకుడు సాయికిరణ్ అడవి సంతోషం వ్యక్తం చేశారు.ఒక మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారని ఈ చిత్ర విజయం మరోసారి రుజువు చేసిందని సాయికిరణ్ అడవి పేర్కొన్నారు. 1 కోటి 39 లక్షల బడ్జెట్ తో సినిమా పూర్తి చేయడం వల్ల సినిమా కమర్షియల్ గా కూడా చాలా మంచి విజయం సాధించినట్టు మహి తెలిపారు. ఈ సినిమాలో విజయంలో కృష్ణుడు, శరణ్యమోహన్, యండమూరి వీరేంద్రనాథ్, రావురమేష్ ముఖ్య పాత్రలు పోషించారనీ, అలాగే సంగీత పరంగా మణికాంత్ కద్రి, మార్తండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్ విజయ్ శంకర్, చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ అర్జున్ పనితనం వంటి వన్నీ కలిపి ఈ చిన్న సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి దోహదపడ్డాయని అన్నారు. చిత్ర యూనిట్ అందరికీ తమ ధన్యవాదాలనీ, మూన్ వాటర్ పిక్చర్స్ లో ప్రారంభమయ్యే తదుపరి చిత్రం గురించి త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు.
No comments:
Post a Comment