డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడుగా సూర్యకిరణ్ దర్శకత్వంలో ఓ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కనుంది. దీనికి నటి, సూర్యకిరణ్ సతీమణి కల్యాణి నిర్మాతగా వ్యవహరిస్తారు. మిడాస్ టచ్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. మిడాస్ టచ్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 1గా సూర్యకిరణ్ దర్శకత్వంలో కల్యాణి నటిస్తూ తొలిసారి నిర్మించిన 'చాప్టర్ 6' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ బ్యానర్ ద్వితీయ చిత్రంగా రాజశేఖర్ హీరోగా రూపొందే చిత్రం ఉంటుంది.చిత్ర విశేషాలను సూర్యకిరణ్ తెలియజేస్తూ, రాజశేఖర్ ఇంతవరకు చేయనటువంటి పాత్రను ఇందులో పోషిస్తున్నారనీ, వైవిధ్యమైన కథ, కథనాలతో ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. రాజశేఖర్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని అన్నారు. జనవరి మూడో వారంలో షూటింగ్ ప్రారంభించి సమ్మర్ కానుకగా సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని చెప్పారు.
No comments:
Post a Comment