'ఆనంద్' ఫేమ్ రాజా, సంచిత పదుకునే ( తొలి పరిచయం) జంటగా ఓ వాస్తవ ప్రేమకథను తెరకెక్కించనున్నారు. శ్రీనివాస బల్లంపురం దర్శకత్వంలో సి.గోపాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈనెల 18 నుంచి ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.హైద్రాబాద్ లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ ఎన్.ఆర్.ఐ. ప్రేమకథ స్ఫూర్తితో ఈ చిత్ర ఇతివృత్తం ఉంటుందనీ, రాజా బాడీలాంగ్వేజ్ కు అనుగుణంగా అతని పాత్ర తీరుతెన్నులు ఉంటాయనీ దర్శకుడు తెలిపారు. యూత్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయన్నారు. ఈనెల 18 నుంచి హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో టాకీ పూర్తి చేసి, విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి జోషి సినిమాటోగ్రఫీ, వెంగి-విఠల్ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment