కామెడీ హీరోగా ఏటా అత్యధిక సినిమాల్లో నటిస్తూ గణనీయమైన సకెస్స్ లు సాధిస్తున్న అల్లరి నరేష్ ఇటీవలే 'బెండు అప్పారావు'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ చూపు ఆయనపై పడినట్టు తెలుస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రణ్ బీర్ కపూర్, షాజాన్ పదంసీ, గౌహర్ ఖాన్ ప్రధాన పాత్రధారులుగా షమిత్ అమిన్ దర్శకత్వంలో డిసెంబర్ 11న విడుదలైన 'రాకెట్ సింగ్: సేల్స్ మన్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ప్రేక్షకాదరణ చూరగొంటోంది. ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసేందుకు యష్ రాజ్ సంస్థ సన్నాహాలు చేస్తోందనీ, హీరోగా అల్లరి నరేష్ నటించనున్నారనీ తెలిసింది.యష్ రాజ్ సంస్థ ఈ విషయాన్ని ఇంకా బయటపెట్టనప్పటికీ సంస్థ వర్గాలు మాత్రం తెలుగు రీమేక్ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. అల్లరి నరేష్ ప్రస్తుతం రవితేజ ఒక హీరోగా రూపొందుతున్న మల్టీ స్టారర్ 'శంభో శివ శంభో' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందనున్న 'సముద్రం', వంశీ దర్శకత్వంలో ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మించనున్న చిత్రానికి కమిట్ అయ్యారు
No comments:
Post a Comment