నందమూరి బాలకృష్ణ ఇంతవరకూ చేయనటువంటి శక్తివంతమైన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సింహా'. యూనైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'భద్ర', 'తులసి' వంటి హిట్ చిత్రాల తర్వాత హ్యాట్రిక్ హిట్ తపనతో బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన నయనతార, నమిత, స్నేహ ఉల్లాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. హైద్రాబాద్ లో ప్రస్తుతం కీలకమైన యాక్షన్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.బాలకృష్ణ పాత్ర చిత్రణ విభిన్నంగా ఉంటుందనీ, శక్తివంతమైన నటనతో పాటు పవర్ ఫుల్ సంభాషణలో ఆయన పాత్ర హైలైట్ అవుతుందనీ బోయపాటి శ్రీను తెలిపారు. మాస్ ను అన్ని అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో నయనతార పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందన్నారు. నిర్మాత మాట్లాడుతూ, శరవేగంగా చిత్ర నిర్మాణం జరుగుతోందనీ, ప్రస్తుతం చిత్రీకరిస్తున్న యాక్షన్ సన్నివేశాల తర్వాత ఫిల్మ్ సిటీలో కొన్ని సన్నివేశాలు తీస్తామనీ చెప్పారు. ఈనెల 10వరకూ ఈ షెడ్యూల్ ఉంటుందన్నారు. దీంతో టాకీ పూర్తవుతుందనీ, బ్యాలెన్స్ ఉన్న 3 పాటలు పూర్తి చేసి ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెస్తామని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్దర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ, చక్రి సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment