భార్యాభర్తలు అనురాగానికి ప్రతీకలైతే ఆ సంసారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది. వారి మధ్య అరమరికలు మొదలై సమన్వయం లోపిస్తే ఆ సంసారం ఇక కల్లోలమే. భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదనే ఆంశాలను చర్చిస్తూ అమోద్ ఎంటర్ టైన్ మెంట్స్ ఓ చిత్రాన్ని అందిస్తోంది. ప్రకాష్ రాజ్, భూమిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి 'కొత్త బంధం' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 'మీరు నాకు అర్ధంకారు' అనేది ట్యాగ్ లైన్. ప్రవాసాంధ్రుడు టేకుల ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో వి.వనితారాణి, ఎ.రాధికారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చిత్రం ప్రోగ్రస్ ను నిర్మాతలు వివరిస్తూ, ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోందనీ, ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో ప్రకాష్ రాజ్, భూమిక తదితరులపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందనీ చెప్పారు. మార్చిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని దర్శకుడు తెలిపారు. దంపతుల మద్య చక్కని అవగాహన ఉన్నప్పుడు, అవగాహనారాహిత్యం ఏర్పడినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇందులో చూపించామనీ చెప్పారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఐఎఎస్ అధికారిగానూ, భూమిక మేనేజిమెంట్ గ్యాడ్యూయేట్ గానూ కనిపిస్తారు. పరుచూరి సోదరులు సంభాషణలు, పూర్ణ సినిమాటోగ్రఫీ, గౌతంరాజు ఎడిటింగ్, చిన్నా సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment