నితిన్, హన్సిక జంటగా ఈశ్వర్ దర్శకత్వంలో వెల్ఫేర్ క్రియేషన్స్ బ్యానర్ పై విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ నిర్మించిన చిత్రం'సీతారాముల కల్యాణం...లంకలో'. కొత్త సంవత్సరం తొలిరోజైన 1వ తేదీన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం విశాఖపట్నంలో కన్నులపండువగా జరిగింది. ఆడియో సీడీని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ఆవిష్కరించి తొలి ప్రతిని విశాఖ కలెక్టర్ జె.శ్యామలరావుకు అందజేశారు. ఆడియో క్యాసెట్ ను విశాఖ పోలీసు కమిషనర్ ఎన్.సాంబశివరావు ఆవిష్కరించి పారిశ్రామికవేత్త కె.మల్లిక్ కు అందజేశారు.నితిన్, హన్సిక, ఈశ్వర్, మళ్ల విజయప్రసాద్, వెల్ఫేర్ క్రియేషన్స్ ఎండి అరుణకుమారి, అనూష, అలేఖ్య, సంగీత దర్శకుడు అనూప్, ఆలీ, విశాఖ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరాజు, పి.విజయకుమార్, మేయర్ పులులు జనార్థనరావు, హుడా ఎండి వి.ఎన్.విష్ణు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది
No comments:
Post a Comment