'మహాత్మ'తో విజయవంతంగా 100 సినిమాలు పూర్తి చేసిన హీరో శ్రీకాంత్ ఇప్పుడు మళ్లీ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. 'మహాత్మ' చిత్రాన్ని గోల్డెన్ లయన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించిన శ్రీకాంత్ స్నేహితుడు సి.ఆర్.మనోహర్ మరోసారి శ్రీకాంత్ తో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.ఫ్యామిలీ కథాంశంతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉండబోతోందనీ, ఇందుకోసం శ్రీకాంత్ తన బరువు తగ్గించుకుని స్లిమ్ కాబోతున్నారనీ చెబుతున్నారు. ఇందుకు తగ్గట్టే ఈ చిత్రానికి 'మిస్టర్ అండ్ మిసెస్ శ్రీకాంత్' అనే పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. శ్రీకాంత్ సరసన చార్మింగ్ అందాల చార్మి నటించనుందట. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి 'కౌసల్య సుప్రజ రామ' చిత్రంలో నటించారు. 'మహాత్మ' చిత్రంలోనూ ఛార్మి ఓ ఐటెం సాంగ్ లో నర్తించింది. ఈ సందర్భంలోనే ఛార్మితో ఓ సినిమా చేయాలని మనోహర్ అనుకున్నారని, ఇప్పుడు ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేశారనీ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది. దీనికితోడు లాఫింగ్ లార్ట్స్ పతాకంపై మరో చిత్రానికి కూడా శ్రీకాంత్ కమిట్ అయ్యారు. బాలాజీ ఎన్.సాయి దర్శకత్వంలో మురళీకృష్ణ నిర్మించనున్న ఈ కొత్తచిత్రం ఈనెల 9న ప్రారంభం కానుంది. పూరీ జగన్నాథ్ సైతం ప్రస్తుతం గోపీచంద్ తో 'గోలీమార్' చిత్రానికి పనిచేస్తుండటంతో పూరీ జగన్నాథ్, శ్రీకాంత్ కాంబినేషన్ చిత్రం మరికొంత వ్యవధి తర్వాత ప్రారంభమవుతుంది.
No comments:
Post a Comment