తెలుగు సినిమా షూటింగ్ లకు తెలంగాణాలో ఎదురవుతున్న ప్రతిఘటనలు 'లీడర్'కూ తప్పలేదు. కరీంనగర్ జిల్లా రామగుండం కోల్ బెల్ట్ ఏరియాలో 'లీడర్' సినిమా షూటింగ్ ను అక్కడి గని కార్మికులు సోమవారం ఉదయం అడ్డుకున్నారు. షూటింగ్ కు నిలిపివేసే ప్రయత్నం చేసినప్పుడు చిత్ర కథానాయకుడు రానా జోక్యం చేసుకుని తానెప్పుడూ తెలంగాణావాదాన్ని వ్యతిరేకించలేదని వారికి వివరించారు. తెలంగాణకు జై కొట్టాలని కార్మికులు పట్టుబట్టడంతో ఆయన మరో ఆలోచనకు తావులేకుండా 'జై తెలంగాణ' అనడంతో వారు శాంతించారు. దాంతో షూటింగ్ ఎలాంటి అవాంతరం లేకుండా మళ్లీ మొదలైంది.శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు మనవడైన రానా 'లీడర్' చిత్రం ద్వారా పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఎవిఎం పతాకంపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇవాల్టి రాజకీయ పరిస్థితుల్లో నిజమైన లీడర్ ఎలా ఉండాలనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నప్పటికీ శేఖర్ కమ్ముల కొంత 'ప్యాచ్ వర్క్' షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా 'లీడర్' రిలీజ్ అవుతుంది
No comments:
Post a Comment