అర్యన్ రాజేష్ కథానాయకుడుగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న 50వ చిత్రం 'బురిడీ'. దీనికి 'తెగ నవ్వించేత్తాడు' అనే ట్యాగ్ లైన్ ఉంది. బిగ్ బి ప్రొడక్షన్స్ పతాకంపై ఈదర శ్రీనివాస్, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నూతన సంవత్సరం తొలిరోజైన శుక్రవారంనాడు ఈ కొత్త చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లో ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి ఈదర శ్రీనివాస్ క్లాప్ ఇవ్వగా, ఈడ్పుగంటి పూర్ణచంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఇవివి దర్శకత్వం వహించారు.ఇవివి సత్యనారాయణ మాట్లాడుతూ, సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బురిడీ కొట్టడమే, కొట్టించుకోవడమో జరుగుతుంటుందనీ, ఈ సినిమాలో కూడా ప్రతి పాత్ర కూడా ఇదే తరహాలో ఉంటుందనీ, టైటిల్ కు చాలా మంచి రెస్పాన్ వస్తోందనీ చెప్పారు. రెండున్నర గంటల పాటు నాన్ స్టాప్ నవ్వలు ఖాయమని అన్నారు. ఈ నెలాఖరు నుంచి హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ, రామోజీ ఫిల్మ్ సిటీ లోనూ రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనీ, ఫిబ్రవరి 1 నుంచి బ్యాంకాక్ లో జరిపే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందన్నారు. మే మొదటివారంలో వేసవి కానుకగా రిలీజ్ ఉంటుందన్నారు. ఇవివి 'మా నాన్నకు పెళ్లి'తో పరిచయమైన తాను 400 చిత్రాల్లో నటించి నాలుగు నందులు అందుకున్నాననీ, ఈ చిత్రం ద్వారా మరో నంది ఆశిస్తున్నానని ప్రముఖ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అన్నారు. ఈ చిత్రం మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్టు సీనియర్ నటుడు చలపతిరావు పేర్కొన్నారు. వినోద ప్రధానంగా ఈచిత్రం ఉంటుందని నిర్మాతలు తెలిపారు. నటుడు రఘుబాబు కూడా మాట్లాడారు. ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్ కు జంటగా ఐశ్వర్య (తొలి పరిచయం) నటిస్తోంది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ఆలీ, జయప్రకాష్ రెడ్డి, చలపతిరావు, ఎల్బీ శ్రీరాం, కృష్ణభగవాన్, జీవా, శివారెడ్డి, సుమన్ శెట్టి, తిరుపతి ప్రకాష్, బెనర్జీ, కోవైసరళ, శ్రీలక్ష్మి, తెలంగాణ శకుంతల సురేఖావాణి, గీతాసింగ్, జెన్నిఫర్ తదితరులు నటించనున్నారు. జనార్ధన మహర్షి మాటలు, రామజోగయ్య శాస్త్రి-సుద్దాల అశోక్ తేజ పాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, కోటి సంగీతం అందించనున్నారు
No comments:
Post a Comment