రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి, అభినవ ప్రధాన పాత్రధారులుగా సముద్రఖని దర్శకత్వంలో శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'శంభో శివ శంభో' చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది. సుందర్ సి.బాబు సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో శనివారంనాడు జరిగింది. ముఖ్య అతిథిగావిచ్చేసిన గోపీచంద్ ఆడియో సీడీలు, క్యాసెట్లను రిలీజ్ చేసి రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ తదితరులకు అందించారు. సముద్ర ఖని, బెల్లంకొండ సురేష్, అభినవ, సునీల్, తనికెళ్ల భరణి, రావు రమేష్, సుందర్ సి.బాబు, భాస్కరభట్ల, తదితరులు హాజరయ్యారు.గోపీచంద్ మాట్లాడుతూ, ఈ చిత్రం తమిళ వెర్షన్ 'నాడోడిగళ్' తాను చూశాననీ, ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్స్ చూశాననీ, తమిళంలో కంటే మంచి విజయాన్ని ఈ చిత్రం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. రవితేజ మాట్లాడుతూ, ఇంతవరకూ తాను నటించిన చిత్రాల కంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాననీ, చాలా బాగా వచ్చిందనీ చెప్పారు. సముద్రఖని చాలా అద్భుతగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ, తమిళంలో చాలా పెద్ద సక్సెస్ అయిన సినిమా ఇదనీ, ఈ చిత్రం అంతకంటే పెద్ద విజయం సాధించి నిర్మాతకు బస్తాలు బస్తాలు డబ్బులు రావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, ఇప్పటివరకూ తాను తీసిన సినిమాలు నిర్మాతగా తనకు డబ్బులు సంపాదించిపెట్టాయనీ, అయితే రవితేజతో చేసిన 'నా ఆటోగ్రాప్ స్వీట్ మెమరీస్' చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిందనీ అన్నారు. ఆమధ్య అమెరికా వెళ్లినప్పుడు 'నా ఆటోగ్రఫ్' నిర్మాతగా తనను అంతా గుర్తించి ప్రశంసించారని అన్నారు. మళ్లీ అంతకుమించిన చిత్రంగా 'శంభో శివ శంభో' తనకు మంచిపేరు తెస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. దర్శకుడు సముద్రఖనితో మరో సినిమా తీసేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. జనవరి 14న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రం నిర్మాతకు కనకవర్షం కురిపించాలని అతిథులంతా అభిలషించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది
No comments:
Post a Comment