రామ్ చరణ్ కథానాయకుడుగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం ఫిబ్రవరి మొదటివారం నుంచి సిడ్నీలో షూటింగ్ జరుగనుంది. కె.వెంకట్రావు సమర్పణలో నాగేంద్రబాబు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 7 చిత్రమిది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.నాగేంద్రబాబు ఆ వివరాలు తెలియజేస్తూ...తొలి షెడ్యూల్ ముంబైలో డిసెంబర్ 11 నుంచి 20 వరకూ జరిపామనీ, ఈ షెడ్యూల్ కీలక సన్నివేశాలు చిత్రీకరించామనీ చెప్పారు. ఫిబ్రవరి మొదటివారం నుంచి సిడ్నీలో సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందనీ, కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తామనీ చెప్పారు. బొమ్మరిల్లు, పరుగు వంటి ట్రెమండస్ హిట్ చిత్రాల తర్వాత భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్నామని అన్నారు. 'మగధీర' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ తో చేస్తున్న ఈ చిత్రం అందరి అంచనాలకు మించే విధంగా రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జెనీలియా, షాజన్ పదంసి హీరోయిన్లుగా నటిస్తున్నారు. బ్రహ్మానందం, ప్రభు, సుమన్, ప్రగతి, కిషోర్, ప్రణీత్, కల్పిక, ప్రగతిక తదితరులు నటిస్తున్నారు. తోటప్రసాద్ మాటలు, వనమాలి పాటలు, కిరణ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఆనందసాయి కళాదర్శకత్వం, పీటర్ హెయిన్స్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, హారిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఆరంజ్' అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది.
No comments:
Post a Comment