విలనీ పాత్రల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఇటీవల హీరోగా మారినప్పటికీ సక్సెస్ పరంగా ఇంకా ఏటికి ఎదురీతుతూనే ఉన్నారు. అజయ్ హీరోగా నటించిన 'ఆ ఒక్కడు', 'సారాయి వీర్రాజు' చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వైఫల్యాలను చవిచూశాయి. అయితే హీరోగా ముచ్చటగా మూడో ఛాన్స్ అజయ్ ను దక్కించుకున్నారు. ఇది ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనుంది. తమిళ దర్శకుడు సేతు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించన్నారు.ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అందించనున్నారనీ, ఈనెల 18న ఈ కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభం కానుందనీ తెలుస్తోంది. అజయ్ కు ఈ చిత్రమైనా ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి
No comments:
Post a Comment