సృష్టిలో స్నేహం, ప్రేమకు ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రేమలో స్వార్థం ఉంటుందేమో కానీ స్నేహంలో మాత్రం స్వార్ధానికి తావులేదని నమ్మే ఓ యువకుడి కథాంశంతో రూపొందిన చిత్రం 'బెట్'. దేనికైనా ఛాలెంజ్ అనేది ట్యాగ్ లైన్. భరత్ ('ప్రేమిస్తే' ఫేమ్), ప్రియమణి జంటగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తమిళంలో ప్రేక్షకాదరణ చూరగొన్ని చిత్రమిది. దీనిని శిల్పి క్రియేషన్స్ పతాకంపై నిర్మాత తొండపు నాగేశ్వరరావు తెలుగులోకి అనువదిస్తున్నారు.ప్రేమ, స్నేహం ప్రధానాంశాలుగా రూపొందిన చిత్రమిదని నిర్మాత తెలిపారు. స్నేహం కోసం ప్రాణాలైన ఇచ్చేంత గొప్ప యువకుడు కథానాయకుడునీ, అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నదే కథాంశమనీ చెప్పారు. భరణ్, ప్రియమణి మధ్య సన్నివేశాలు, పాటల చిత్రీకరణ యూత్ ను బాగా అలరిస్తాయని అన్నారు. వైజాగ్, మారిషస్, దుబాయ్ లలో షూటింగ్ జరిగిందనీ, నాలుగు ఫైట్లు, ఐదు ముచ్చటైన గీతాలు హైలైట్ గా నిలుస్తాయన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయనీ, ఇదే నెలలో ఆడియో, నెలాఖరులో కానీ ఫ్రిబవరి మొదటివారంలో కానీ సినిమా విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రానికి శశాంక్ వెన్నెలకంటి మాటలు, వేటూరి-భువనచంద్ర-శివగణేష్-వనమాలి పాటలు, భూపతి సినిమాటోగ్రఫీ, దేవా సంగీతం అందించారు.
No comments:
Post a Comment