సెక్సీ బాంబ్ షకీలా ఎట్టకేలకు తనకు కాబోయే వరుడు ఎవరనే విషయాన్ని ప్రకటించింది. ఈమధ్యనే 2010 జూలైలో తన పెళ్లి ఉంటుందంటూ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన షకీలా మరిన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. తాజాగా తన భర్త వివరాలను, ఇటీవలే నిశ్చితార్ధం కూడా జరిగిన విషయాన్ని ఆమె వెల్లడించింది. చెన్నైకి చెందిన పి.జి.సతీష్ అనే వ్యాపారవేత్తను షకీలా పెళ్లాడనుంది. విజయకాంత్ డిఎండికె పార్టీతో ఆయనకు సంబంధ బాంధవ్యాలు కూడా ఉన్నాయి. ఫిల్మ్ ఫైనాన్సియర్ గా, రియాల్టర్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. 'సతీష్-నేనూ చాలాకాలంగా ఒకరికొకరు బాగా అర్ధం చేసుకున్నాం. ఇటీవలే పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నాం. గత నెలలోనే నిరాడంబరంగా నిశ్చితార్ధం జరిగింది' అని షకీలా పేర్కొంది. మలయాళ చిత్రాలకు షకీలా ఉద్వాసన చెప్పిన తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ వచ్చింది. దీనిపై ఆమె ముచ్చటిస్తూ 'మలయాళంలో బి గ్రేడ్ మూవీస్ కు ఎప్పుడో స్వస్తి చెప్పాను. అంత మాత్రాన ఇక సినిమాల్లో నటించకూడదనే ఆలోచన మాత్రం లేదు. సతీష్ తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాను' అని వివరించింది. త్వరలోనే పెళ్లి తేదీని కూడా తెలియజేస్తానని పేర్కొంది. ప్రస్తుతం ఆమె తమిళంలో 'మాంజ వేలు', 'తొట్టు పార్'. 'పయనగల్ తోడరుం' చిత్రాల్లో షకీలా నటిస్తోంది.
No comments:
Post a Comment