శ్రీకాంత్ కథానాయకుడుగా లాఫింగ్ లార్ట్స్ పతాకంపై ఓ కొత్త చిత్రం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి బాలాజీ ఎన్.సాయి దర్శకుడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత మురళీ కృష్ణ తెలిపారు.'ఖడ్గం', 'ఆపరేష్ దుర్యోధన', 'మహాత్మ' తర్వాత శ్రీకాంత్ కు ఇది మరో మంచి చిత్రమవుతుందనీ, పూర్తి స్థాయి యూక్షన్ ప్రధానాంశంగా ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. శ్రీకాంత్ పాత్ర చిత్రణ వైవిధ్యంగా ఉంటుందనీ, భిన్న భోవోద్వేగాలు, భిన్న గెటప్స్ లో కనిపిస్తారనీ చెప్పారు. ఇందులో ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు, ఒక కొత్త హీరోయిన్ నటిస్తారని చెప్పారు. కథానుగుణంగా సిక్కిం, నేపాల్ ప్రాంతాల్లో చిత్రీకరణ ప్లాన్ చేస్తున్నామని అన్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ నెల 9 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు
No comments:
Post a Comment