తెలుగు సినిమాకు 'ప్రాంతీయ' సెగ సోకి కొత్త రిలీజ్ లు కోసం ఆవురావురుమంటూ చూస్తున్న సినీ గోయర్స్ కొత్త సంవత్సరంలో ఏకాస్త ఎంటర్ టైన్ చేయగలిగిన సినిమా వచ్చినా అక్కున చేర్చుకునేలా ఉన్నారు. ఒకటి రెండు సార్లు విడుదలకు ఊగిసలాడిన చిత్రాలు జనవరికి షిప్ట్ అవడంతో కొత్త సంవత్సరంలో తొలి రోజు...అందులోనూ తొలి రిలీజ్ గా 'మా నాన్న చిరంజీవి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అంటే పేద్ద హీరో' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంది. టైటిల్..ట్యాగ్ ను బట్టే ఇది 'చైల్డ్ సెంటిమెంట్' సినిమా అని ఇట్టే అర్ధమవుతుంది. అందులోనూ ఈమధ్యనే 'గౌతమ్ ఎస్.ఎస్.సి.' వంటి ప్రయోజనాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన అరుణ్ ప్రసాద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, ఫ్యామిలీ ఆడియెన్స్ లో క్రేజ్ ఉన్న జగపతిబాబును బాధ్యత గల తండ్రి పాత్రను పోషించడం సహజంగానే కొన్ని అంచనాలు రేకెత్తించింది. చిరంజీవి అనే టైటిల్ ను బట్టి హీరోలో ఎక్కువ డైనమిజం ఉంటుందని జనం ఊహించుకోవడం సహజమే కానీ...దర్శకుడి ఆలోచన మాత్రం వేరే. అందరి పిల్లలకూ నాన్నే హీరో కదా. అలాంటి ఓ నాన్నకూ...అతనే సర్వస్వం అనుకునే అతని చిన్నారి కొడుక్కీ మధ్య ఉండే భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. మంచి కథను తీసుకున్నప్పుడు ఎగ్జిక్యూషన్ లో కూడా పట్టు ఉండాలి. అది తెరపై కనిపించాలి. అప్పుడే ప్రేక్షకుడి సన్నివేశాల్లో లీనమవుతారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినా మెమరీ నుంచి కొన్ని సన్నివేశాలైనా చెక్కుచెదరకుండా ఉంటే దర్శకుడు సక్సెస్ అయినట్టే. అరుణ్ ప్రసాద్ ఎత్తుగడ బాగానే ఉన్నా ఆదరాబాదరా ముగింపుతో ఎగ్జిక్యూషన్ లోపాన్ని ఆపాందించుకున్నారు. భార్యాభర్తల మధ్య సంఘర్షణను చూపి విడిపోయేలా చూపించినప్పుడు....తిరిగి వాళ్లను కలిపేటప్పుడు కూడా అలాంటి బలమైన సంఘర్షణ ఉండాలి. అంటే ఆ పాత్రల మధ్య 'రియలైజేషన్' తప్పనిసరి. ఈ ప్రాథమిక సూత్రాన్ని దర్శకుడు ఎందుకో మిస్సయ్యారు. సాదాసీదా నడక సాగించారు. ఆ వివరాల్లోకి వెళ్తే
No comments:
Post a Comment