విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా తొలిసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'నమో వెంకటేశ' చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 5న బ్యాంకాక్ లో జరగనుంగి. ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణ థాయ్ లాండ్ లో ఆదివారం నుంచి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆడియో రిలీజ్ ను కూడా బ్యాంకాక్ లో నే ప్లాన్ చేసినట్టు సమాచారం. ముందుగా నిర్ణయించిన ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంట్రిలాక్విస్ట్ గా వెంకటేష్ నటిస్తుండగా, ఆయన సరసన 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే' తర్వాతే త్రిష రెండోసారి నటిస్తోంది. పారిస్ ప్రసాద్ గా పూర్తి స్థాయి కామెడీ పాత్రను బ్రహ్మానందం పోషిస్తున్నారు. గతంలో పలు చిత్రాల్లో కామెడీ చేసినప్పటికీ ఇందులో కామెడీ పీల్ లెవల్ లో ఉంటుందని వెంకటేష్ ఇటీవల తెలిపారు. తనకు ఇష్టమైన వెంకటేష్ బాబుతో 'నమో వెంకటేశ ' చేయడం హ్యాపీగా ఉందనీ, పండుగకు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విందు భోజనం లాంటి సినిమా ఇదనీ శ్రీనువైట్ల అభివర్ణించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల కానుంది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆలీ, కోట శ్రీనివాసరావు, జెపి, ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, ధర్మవరపు, ముఖేష్ రిషి, సుబ్బరాజు, సురేఖవాణి, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
No comments:
Post a Comment