హ్యాండ్ సమ్ హీరో సాయికిరణ్ కొత్త సంవత్సరంలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. గాయకుడు, నటుడు వి.రామకృష్ణ కుమారుడైన సాయికిరణ్ వివాహం జూన్ 2న జరుగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమనీ, బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన అమ్మాయితోనే ఆయన వివాహం నిశ్చయమైందనీ తెలిసింది. వధువు బెంగుళూరుకు చెందిన ఐటి ప్రొఫెషనల్.సాయికిరణ్ సుమారు 20 చిత్రాల్లో నటించారు. తొలిచిత్రం 'నువ్వేకావాలి' పెద్ద సక్సెస్ సాధించింది. ఆ తర్వాత 'ప్రేమించు', 'రామ్ దేవ్', 'అదే నవ్వు', 'క్షణం', 'ఉత్సాహం', 'ఎంతబాగుందో', 'హైటెక్ కుర్రాళ్లు', 'ఎక్కడికెళ్తోందో మనసు', 'షిర్డి' వంటి పలు చిత్రాల్లో నటించారు. అయితే తొలి చిత్రం తర్వాత మళ్లీ ఇంతవరకూ ఆయనకు సరైన బ్రేక్ దొరకలేదు. ఇటీవల కాలంలో ఆయన తన ఆహార్యానికి తగినట్టుగా భక్తిరస పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించన 'స్వామి మణికంఠ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
No comments:
Post a Comment