జనవరిలో వస్తున్న 'సుభద్ర'

సింధుమీనన్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతన్న హీరోయిన్ ఓరియెంటెడ్ థ్రిల్లర్ 'సుభద్ర'. శ్రీకాంత్ టాకీస్ పతాకంపై శ్రీకాంత్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజా వన్నెంరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్, రీరికార్డింగ్ పూర్తి చేసుకుని మిక్సింగ్, డిటిఎస్ వర్క్ జరుపుకొంటోంది. కొత్త సంవత్సరం కానుకగా జనవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు నిర్మాత తెలిపారు.నవ్యతను కోరుకునే ఈ తరం ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయనీ, రాజా వన్నెంరెడ్డి ఎంతో పట్టుదలగా ఈ యూత్ థ్రిల్లర్ ను రూపొందించారనీ ఆయన చెప్పార. సింధుమీనన్ అద్భుతమైన నటన ప్రదర్శించిందనీ, హీరో రవికిరణ్ నటన సుపర్బ్ గా ఉంటుందనీ అన్నారు. కొత్తదనంతో కూడుకున్న ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందన్నారు. జనవరి మొదటివారంలో ఫస్ట్ కాపీ వస్తుందనీ, ఆ వెంటనే సెన్సార్ పూర్తిచేయి అదే నెలలో విడుదల చేస్తామనీ తెలిపారు. రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ, మా 'సుభద్ర'ను చూసి అందరూ ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నానని అన్నారు. నిర్మాత తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈ చిత్రం బాగా రావడానికి సహకరించారనీ, అలాగే సంగీత దర్శకుడు చక్రి కూడా సినిమా మొత్తం రషెస్ చూసి తనను అభినందించారనీ చెప్పారు. 22 రోజుల పాటు రీరికార్డింగ్ చేసినట్టు చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, సుమన్, భానుచందర్, చలపతిరావు, రఘబాబు, ఎమ్మెస్ నారాయణ, గౌతంరాజు, చిన్నా, అన్నపూర్ణ, సురేఖావాణి, హేమ, అల్లరి సుభాషిణి తదితరులు నటించారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు సైతం రాజా వన్నెంరెడ్డి సమకూర్చిన ఈ చిత్రానికి ఎన్.సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, చక్రి సంగీతం అందించారు.

No comments:

Post a Comment