నమిత 'న్యూ' షాక్ !

కొత్త సంవత్సరం వస్తోందంటే సెలబ్రెటీలు క్రొంగొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. హాట్ గాళ్ నమిత తన కొత్త సంవత్సరం నిర్ణయాన్ని తు.చ. తప్పకుంటా అమలు చేస్తే మాత్రం సరికొత్త నమితను అందరూ చూడబోతారు. ఆ తీర్మానం ఏమై ఉంటుంది? తనకున్న సెక్సీ ఇమేజ్ నమితకు బోర్ కొట్టేసిందట. కొత్త సంవత్సరంలో ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉండాలనుకుంటోందట.'2010లో అందరూ కొత్త నమితను చూడబోతున్నారు. నాకు క్రమంగా దైవభక్తి ఎక్కువవుతోంది. కొత్త సంవత్సరం నుంచి ఎక్కువ సార్లు గుడికి వెళ్లదలచుకున్నాను' అని చెబుతోంది నమిత. నమితకు గుడి కట్టించిన వీరాభిమానులు తమిళనాట ఉండనే ఉన్నారు. ఇదంతా నమిత గ్లామర్ ఇమేజ్ వల్లే సాధ్యమైంది. తెలుగునాట కూడా తనకు గుడి కట్టించే రీతిలో అభిమానులను పెంచుకోవాలని గత కొద్దికాలంగా నమిత తన వంతు కష్టపడుతూనే ఉంది. ఈ తరుణంలో తీసుకున్న కొత్త సంవత్సరం రిజల్యూషన్ ఆమె అభిమానులకు షాక్ లాంటిందే. నిజంగానే నమిత తన సెక్సీ ఇమేజ్ కు దూరమవుతుందా? లేక తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా అనేది కొత్త సంవత్సరమే తేల్చాలి. ప్రస్తుతానికి మాత్రం నమిత అభిమానులు మాత్రం ఆమె నటించగా విడుదలకు సిద్ధంగా ఉన్న మలయాళీ చిత్రం 'బ్లాక్ స్టాలిన్' కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. నమిత భారీ స్కిన్ షో చేసిన ఈ చిత్రం తెలుగులోనూ 'ఇద్దరు మొనగాళ్లు' పేరుతో రాబోతోంది. అన్నట్టు...హీరోయిన్లను వాంప్ పాత్రల స్థాయికి తగ్గించ గలిగిన పోసాని కృష్ణమురళి సరనన 'మిస్ చింతామణి ఎంఏ' చిత్రానికి కూడా నమిత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చింతామణి-సుబ్బిశెట్టి కథ తెలియని జనాలుండరు. చింతామణి చిలుక పలుకులు పలుకుతుందంటారా

No comments:

Post a Comment