skip to main |
skip to sidebar
టీనేజ్ లో గాడితప్పిన విద్యార్థులకు, క్రమశిక్షణతో మసలే విద్యార్థుల భవితవ్యానికి మధ్య ఉండే తారతమ్యాన్ని చూపిస్తూ జీవిఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై కవిత ఇంజేటి నిర్మించిన చిత్రం 'యుగళగీతం'. శివాజీ దర్శకుడు. కొత్త సంవత్సరం తొలిరోజైన జనవరి 1న ఈ చిత్రం విడుదలవుతోంది.కళాశాల దశలో తీసుకున్న నిర్ణయాలే విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకాలు అవుతాయనీ, అదే ఈ సినిమాలో చూపించామని కవిత ఇంజేటి తెలిపారు. రాజ్ కిరణ్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన వస్తోందని చెప్పారు. దర్శకుడు శివాజీ మాట్లాడుతూ, కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదనీ, చదువే ప్రధానంగా ఉంటూ, ప్రేమ జీవితానికి ప్రతిబంధం కాకూడదని ఈ సినిమాలో చెబుతున్నామనీ అన్నారు. శ్రీకర్, అభిషేక్, చందు, శివ, సోని చరిష్ట, సబ్రీనాహష్మి, లక్ష్మీ చంద్రిక, అనూష ప్రధాన పాత్రలు పోషించారు.
No comments:
Post a Comment