కళ, కళాకారుడు రెండూ అజరామరాలే. కళాకారులు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. బహుశా అదే ధీమాతో కళాకారులు మేమూ సగటు మనుషులమేనంటూ మహాభినిష్క్రమణ చేస్తారు. వెండితెరపై ధగధగా మెరిసిన నక్షత్రాలు కొన్ని ఈ ఏడాది నేలరాలాయి. కాంతారావు, నిర్మలమ్మ, ఎస్.వరలక్ష్మి, నర్రా వెంకటేశ్వరరావు, నగేష్, రాజన్ పి.దేవ్, ఫైట్ మాస్టర్ రాజు వంటి పలువురు ప్రతిభావంతులైన కళాకారులను పరిశ్రమ కోల్పోయింది.తెలుగు, తమిళ భాషల్లో 1000కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ హాస్య నటుడు నగేష్ (75) సుదీర్ఘ అస్వస్థతతో జనవరి మాసంలో కన్నుమూశారు. పరిశ్రమలోని అందరిచేత అమ్మగా మన్ననలు అందుకున్న ప్రముఖ నటి నిర్మలమ్మ కూడా ఇదే ఏడాది కనుమరుగయ్యారు. ఎన్టీఆర్, అక్కినేని, శివాజీగణేషన్ వంటి ఎందరో హీరోలతో నటించి మెప్పించిన నటి, గాయని, నిర్మాత ఎస్.వరలక్ష్మి మనం కోల్పోయిన తారలలో సీనియర్ నటీమణి. 'మహామంత్రి తిమ్మరుసు', 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం', 'సత్య హరిశ్చంద్ర', 'వీరపాండ్య కట్టబొమ్మన్' వంటి చిత్రాలు వరలక్ష్మి ప్రతిభను చాటుతాయి. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల హీరోగా ఎన్టీఆర్, అక్కినేనిల తర్వాత మూడవ స్థానం ఆక్రమించిన సీనియర్ నటుడు కాంతారావు ఈ ఏడాది మార్చిలో తన 86వ ఏట కన్నుమూశారు. ఆయనకు పేరు తెచ్చిన ఎన్నో చిత్రాల్లో 'లవకుశ', 'గురువును మించిన శిష్యుడు', 'సప్తస్వరాలు' వంటివి ఉన్నాయి. నిర్మాతగా పలు ఉత్తమాభిరుచి గల సినిమాలు కూడా తీశారు. సుమారు 400 చిత్రాల్లో నటించిన ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వరించింది. చివరిసారిగా బాలకృష్ణ 'పాండురంగడు' చిత్రంలో ఆయన నటించారు. ప్రముఖ క్యారెక్టర్ నటుడు నర్రా వెంకటేశ్వరరావు డిసెంబర్ 27న తన 62వ ఏట కన్నుమూశారు. విప్లవ కథాచిత్రాలు పేరు చెబితే నర్రా పేరు గుర్తొస్తుంది. 'మల్లెల మనసులు' చిత్రంతో ప్రారంభించి సుమారు 500 చిత్రాల్లో నటించారు. ప్రముఖ మలయాళ నటుడు రాజన్ పి.దేవ్ తెలుగులోనూ 'సింహాద్రి', 'ఆది' చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాయి. ఆయన సైతం ఇదే ఏడాది కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా తెలుగు పరిశ్రమకు సేవలందించిన సీనియర్ ఫైట్ మాస్టర్ రాజు ఈ డిసెంబర్ లోనే కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఒరియా తదితరల భాషల్లో 100కు పైగా చిత్రాలకు ఫైట్స్ సమకూర్చిన రాజు పలుచిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు సైతం పోషించారు. ఇదే ఏడాది పరిశ్రమను వీడిన ప్రముఖులలో సీనియర్ నటి, నర్తకి జయవిజయ, మేటి దర్శకుడు గుత్తా రామినీడు, రంగస్థల, టీవీ, సినీనటుడు భానుప్రకాష్, ప్రతిభావంతుడైన కెమెరామన్ గా, నిర్మాతగా గుర్తింపు ఉన్న ఎస్.వెంకటరత్నం ఉన్నారు2009: నేలరాలిన తారలు
కళ, కళాకారుడు రెండూ అజరామరాలే. కళాకారులు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. బహుశా అదే ధీమాతో కళాకారులు మేమూ సగటు మనుషులమేనంటూ మహాభినిష్క్రమణ చేస్తారు. వెండితెరపై ధగధగా మెరిసిన నక్షత్రాలు కొన్ని ఈ ఏడాది నేలరాలాయి. కాంతారావు, నిర్మలమ్మ, ఎస్.వరలక్ష్మి, నర్రా వెంకటేశ్వరరావు, నగేష్, రాజన్ పి.దేవ్, ఫైట్ మాస్టర్ రాజు వంటి పలువురు ప్రతిభావంతులైన కళాకారులను పరిశ్రమ కోల్పోయింది.తెలుగు, తమిళ భాషల్లో 1000కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ హాస్య నటుడు నగేష్ (75) సుదీర్ఘ అస్వస్థతతో జనవరి మాసంలో కన్నుమూశారు. పరిశ్రమలోని అందరిచేత అమ్మగా మన్ననలు అందుకున్న ప్రముఖ నటి నిర్మలమ్మ కూడా ఇదే ఏడాది కనుమరుగయ్యారు. ఎన్టీఆర్, అక్కినేని, శివాజీగణేషన్ వంటి ఎందరో హీరోలతో నటించి మెప్పించిన నటి, గాయని, నిర్మాత ఎస్.వరలక్ష్మి మనం కోల్పోయిన తారలలో సీనియర్ నటీమణి. 'మహామంత్రి తిమ్మరుసు', 'శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం', 'సత్య హరిశ్చంద్ర', 'వీరపాండ్య కట్టబొమ్మన్' వంటి చిత్రాలు వరలక్ష్మి ప్రతిభను చాటుతాయి. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల హీరోగా ఎన్టీఆర్, అక్కినేనిల తర్వాత మూడవ స్థానం ఆక్రమించిన సీనియర్ నటుడు కాంతారావు ఈ ఏడాది మార్చిలో తన 86వ ఏట కన్నుమూశారు. ఆయనకు పేరు తెచ్చిన ఎన్నో చిత్రాల్లో 'లవకుశ', 'గురువును మించిన శిష్యుడు', 'సప్తస్వరాలు' వంటివి ఉన్నాయి. నిర్మాతగా పలు ఉత్తమాభిరుచి గల సినిమాలు కూడా తీశారు. సుమారు 400 చిత్రాల్లో నటించిన ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వరించింది. చివరిసారిగా బాలకృష్ణ 'పాండురంగడు' చిత్రంలో ఆయన నటించారు. ప్రముఖ క్యారెక్టర్ నటుడు నర్రా వెంకటేశ్వరరావు డిసెంబర్ 27న తన 62వ ఏట కన్నుమూశారు. విప్లవ కథాచిత్రాలు పేరు చెబితే నర్రా పేరు గుర్తొస్తుంది. 'మల్లెల మనసులు' చిత్రంతో ప్రారంభించి సుమారు 500 చిత్రాల్లో నటించారు. ప్రముఖ మలయాళ నటుడు రాజన్ పి.దేవ్ తెలుగులోనూ 'సింహాద్రి', 'ఆది' చిత్రాల్లో విలన్ గా నటించి ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాయి. ఆయన సైతం ఇదే ఏడాది కన్నుమూశారు. మూడు దశాబ్దాలుగా తెలుగు పరిశ్రమకు సేవలందించిన సీనియర్ ఫైట్ మాస్టర్ రాజు ఈ డిసెంబర్ లోనే కన్నుమూశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఒరియా తదితరల భాషల్లో 100కు పైగా చిత్రాలకు ఫైట్స్ సమకూర్చిన రాజు పలుచిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు సైతం పోషించారు. ఇదే ఏడాది పరిశ్రమను వీడిన ప్రముఖులలో సీనియర్ నటి, నర్తకి జయవిజయ, మేటి దర్శకుడు గుత్తా రామినీడు, రంగస్థల, టీవీ, సినీనటుడు భానుప్రకాష్, ప్రతిభావంతుడైన కెమెరామన్ గా, నిర్మాతగా గుర్తింపు ఉన్న ఎస్.వెంకటరత్నం ఉన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment